News

బాబు, జగన్‌కు భయపడుతున్నారు


రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కర్నూలు జిల్లాలో పరిశ్రమల స్థాపన పనుల్లో జాప్యంపై ఏపీ మంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడటం అభినందనీయమని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమకు అన్యాయం జరుగుతుందని తెలిసినా సీఎం చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు భయపడి నేతలు మాట్లాడలేకపోతున్నారని అన్నారు. కేసీ కెనాల్‌ హక్కులను కర్ణాటకకు ధారాదత్తం చేశారని, ముచ్చుమర్రి లిఫ్ట్‌తో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. అమరావతిని ఫ్రీ జోన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జనవరి 18, 19 తేదీల్లో కర్నూలులో దీక్ష చేస్తానని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు.